LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - కిషన్రెడ్డి లైవ్
🎬 Watch Now: Feature Video
Published : Feb 19, 2024, 4:24 PM IST
|Updated : Feb 19, 2024, 4:55 PM IST
BJP Leader Kishan Reddy Live : లోక్సభ ఎన్నికల సమయం దగ్గర అవుతున్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో 10 సీట్లలలో గెలుపు దిశగా అడుగులేస్తుంది. దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 5 దశలుగా బీజేపీ బస్సు యాత్రను ప్రారంభించనుంది. దీనికి బీజేపీ సిద్ధమయిందని కిషన్రెడ్డి తెలుపుతున్నారు. ఈ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది. దీనిపై పూర్తి సమాచారాన్ని కిషన్రెడ్డి వివరిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,025 కిలోమీటర్లలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నామని చెబుతున్నారు. ఈ నెల 20 తేదీ నుంచి మార్చి 1 వరకు జిల్లాల్లో యాత్రలు కొనసాగుతాయని వెల్లడిస్తున్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలు, అదే పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు, ఆరు దశాబ్ధాల కాలంలో కాంగ్రెస్ లోపాలను ప్రజలకు తెలిపే విధంగా ప్రణాళికలు రూపొందించామని వివరిస్తున్నారు.