కేటీఆర్, హరీశ్‌రావులు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారా? : కోదండరెడ్డి - Kodanda Reddy Fires On BRS - KODANDA REDDY FIRES ON BRS
🎬 Watch Now: Feature Video


Published : Aug 17, 2024, 3:41 PM IST
Kodanda Reddy Fires On KTR Harish Rao : బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లు రైతులను ఏం చేయాలనుకుంటున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి నిలదీశారు. కేటీఆర్‌కు అనుభవం లేక ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు గతంలో సీనియర్ మంత్రిగా పనిచేసి చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీరిద్దరికి రైతులకు రుణమాఫీ చేయడం ఇష్టంలేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యవసాయం, రైతాంగానికి ప్రాముఖ్యత ఇచ్చిందని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల బాధ్యతను తామే తీసుకుంటామని రైతులకు మాట ఇచ్చిందన్నారు. గతంలో చెప్పిన విధంగానే మూడో విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను కూడా మాఫీ చేస్తోందని తెలిపారు. అర్హులై ఉండి రుణమాఫీ కాకపోతే జిల్లాల్లోని నోడల్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం కేబినెట్ మీటింగ్‌లో మంత్రులకు చెప్పారని గుర్తుచేశారు.