జయ జయహే తెలంగాణ ఫుల్ సాంగ్ విడుదల - మీరు విన్నారా - Jaya Jayahe Telangana New Song - JAYA JAYAHE TELANGANA NEW SONG
🎬 Watch Now: Feature Video
Published : Jun 2, 2024, 10:47 PM IST
Jaya Jayahe Telangana New Song Video : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన "పదేళ్ల పండుగ" వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ రాధాకృష్ణన్ సమక్షంలో జయ జయహే తెలంగాణ పాటను ఆవిష్కరించారు. అందె శ్రీ సాహిత్యం అందించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి స్వరపరిచారు. మొత్తంగా ఈ పాట 13 నిమిషాల నిడివి ఉంది. ఒకవైపు రాష్ట్ర గీతం కొనసాగుతుండగానే, ఐదు వేల మంది శిక్షణ పొందిన పోలీసులు జాతీయ పతాకాలతో ప్లాగ్ మార్చ్ చేశారు.
ట్యాంక్‌బండ్‌పై ఆకట్టుకున్న లేజర్ షో : వర్షంలో సైతం శిక్షణ పొందిన పోలీసులు చేసిన ప్లాగ్ మార్చ్ చూపుతిప్పుకోకుండా చేసింది. ఆ వెంటనే ఆకాశంలోకి దూసుకొచ్చిన రంగురంగుల బాణాసంచా అత్యద్బుతంగా ఉంది. వర్షంలో సైతం నగర ప్రజలు బాణాసంచాను చూస్తూ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. చివరగా ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే తెలంగాణకు చెందిన 17 కళల ప్రదర్శన చేశారు. వేడుకలను చూడడానికి తరలివచ్చిన ప్రజలతో ట్యాంక్‌బండ్ జనసంద్రంగా మారింది.