LIVE : కరీంనగర్ బీఆర్ఎస్ కదనభేరీ సభ - BRS Public Meeting In Karimnagar
🎬 Watch Now: Feature Video
Published : Mar 12, 2024, 6:09 PM IST
|Updated : Mar 12, 2024, 7:40 PM IST
KCR Public Meeting In Karimnagar Live : కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) లోక్‌సభ ఎన్నికల కదనభేరీని మోగించారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా నాయకులకు దిశానిర్దేశం చేశారు.బీఆర్ఎస్ కంచుకోటయిన కరీంనగర్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2024) చుక్కెదురైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లకు గాను 12 సీట్లను గెలుచుకున్న గులాబీ పార్టీ 2023లో మాత్రం చతికిలపడింది. కేవలం ఐదింటిని మాత్రమే అత్తెసరు మెజారిటీతో సాధించి ఉనికి చాటుకుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కరీంనగర్ వేదికగా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
Last Updated : Mar 12, 2024, 7:40 PM IST