LIVE : కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ - VINOD KUMAR PRESS MEET - VINOD KUMAR PRESS MEET
🎬 Watch Now: Feature Video


Published : Apr 23, 2024, 11:42 AM IST
|Updated : Apr 23, 2024, 12:07 PM IST
Karimnagar BRS Candidate Vinod Press Meet LIVE : కరీంనగర్ లోక్సభ ఎన్నికల రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ నుంచి ఎంపీ బండి సంజయ్ మరోసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలవగా, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీలో నిలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో కాంగ్రెస్కు కనీసం అభ్యర్థి కూడా లేరంటూ బీఆర్ఎస్, బీజేపీలు ఎద్దేవా చేస్తున్నాయి.కరీంనగర్లో పోటీ తమ మధ్యేనని అంటున్నారు. ప్రచారంలో బిజీగా ఉన్న అభ్యర్థులు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేతలు కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేం లేదంటూ, అభివృద్ధి అంతా తమ హయాంలోనే జరిగిందని అంటున్నారు.
Last Updated : Apr 23, 2024, 12:07 PM IST