'దేశంలో బీజేపీ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారి పోతుంది - ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుంది' - Jeevan Reddy fires On BJP - JEEVAN REDDY FIRES ON BJP
🎬 Watch Now: Feature Video
Published : Apr 9, 2024, 6:57 PM IST
MLC Jeevan Reddy fires On BJP : భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో ఉందని మండిపడ్డారు. భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని కాషాయ పార్టీ మారుస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై జీవన్‌రెడ్డి పలు విమర్శలు గుప్పించారు.
Jeevan Reddy Comments On BJP : మోదీకి అదానీ, అంబానీ అండ ఉందని, రాహుల్ గాంధీకి ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. దేశ సమగ్రత, దేశ ఐక్యతను కాపాడింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసింది ఇందిరా గాంధీ అని కొనియాడారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరితే హిందుత్వ వ్యతిరేకమా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారి పోతుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందని జోస్యం చెప్పారు.