'జయ జయహే తెలంగాణ' కొత్త సాంగ్ ఇదే - లిరిక్స్ వింటే గూస్‌బంప్సే - Jaya Jayahe Telangana Song - JAYA JAYAHE TELANGANA SONG
🎬 Watch Now: Feature Video
Published : Jun 2, 2024, 12:50 PM IST
Jaya Jayahe Telangana Song Launch : "జయజయహే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరితగల తల్లీ నీరాజనం. పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జైజై తెలంగాణ" అంటూ సాగే తెలంగాణ రాష్ట్ర గేయం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి ఆధునిక తెలంగాణ వరకు సాగిన ఈ గేయం వినడానికి ఎంతో సొంపుగా ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత జయ జయహే తెలంగాణ గేయంలో మార్పులు చేస్తూ కొత్త గేయాన్ని విడుదల చేసింది.
అది కూడా కవి అందె శ్రీ మార్గదర్శకంలో సినీ గేయ రచయత ఎంఎం కీరవాణి సంగీతంతో ఈ గేయం అందరినీ మంత్రముగ్దులను చేస్తోంది. తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాలు విడిచిన ఉద్యమకారులను స్మరించుకుంటూ అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని జాతీయపతాకం ఎగురువేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేశారు.