పశువుల పాక కింద పురాతన జైన విగ్రహం - బైరాన్‌పల్లిలో తీర్థంకరుడి శిల్పం - Jain Idol was found in siddipet - JAIN IDOL WAS FOUND IN SIDDIPET
🎬 Watch Now: Feature Video
Published : Jun 10, 2024, 2:06 PM IST
Jain Idol was Found in Siddipet District : జైన మతానికి సంబంధించిన అతి పురాతన విగ్రహం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం భైరాన్‌పల్లి గ్రామంలో బయటపడింది. ఈ శిల్పం నాలుగు ముఖాలు ఒకే విధంగా కలిగి ఉంది. ఆ శిల్పంపై 24వ జైన తీర్థంకరుడు మహావీరుని ధ్యాన శిల్పాలు ఉన్నాయి. నాలుగు అంతస్తుల్లో చెక్కిన ఈ సర్వతోభద్ర శిల్పం శిఖరాన వృషబుని మూర్తి నలువైపులా చెక్కిన ఆనవాళ్లు ఉన్నాయి. మూడో అంతస్తులో మహావీరుడు ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆయనకు ఇరువైపులా చామరులు వేస్తున్నట్లుగా ఉంది. కింద నలువైపులా ఆయన అధికారిక లాంఛనం అయిన 3 సింహాలు చెక్కి ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.
బైరాన్‌పల్లి గ్రామంలో అంగడి వీరన్న దేవాలయం ముందు నరేశ్ అనే వ్యక్తి పశువులకు నివాసాన్ని ఏర్పాటు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆవులను కట్టేసిన ప్రదేశంలో గుంతలు ఏర్పడి ఓ స్తంభం కనిపించింది. స్థానికులు దాన్ని తవ్వి బయటకు తీసి పురాతన రాయిగా గుర్తించారు. ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఈ స్తంభం నాలుగు ముఖాలు ఒకే విధంగా ఉండగా దానిపై జైనుల ఆనవాళ్లును గుర్తించారు. ఇలాంటి శిల్పాలు కొలనుపాక, వేములవాడ వంటి ప్రాంతాల్లో గుర్తించినట్లు చరిత్ర పరిశీలకులు చెప్పారు. ఈ విషయాన్ని పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.