పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పటి నుంచి - ఓటు వేసి బయటకు వచ్చేవరకు - ఈ విషయాలు తెలుసుకోండి - How to Caste Vote - HOW TO CASTE VOTE
🎬 Watch Now: Feature Video
Published : May 12, 2024, 3:37 PM IST
How To Caste Vote : పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న అంశంపై పంపిణీ కేంద్రాల వద్ద మాస్టర్ ట్రైనర్లు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ మొదటిసారి ఓటు హక్కును ఉపయోగించుకునే వారుంటారు. వాళ్లకు అవగాహన ఉన్నా కొన్ని సందర్భాల్లో తికమకపడుతుంటారు. అయితే పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పటి నుంచి, ఓటు వేసే వరకు ఎలా వేయాలి అన్న విషయాన్ని పూర్తిగా చెప్పారు ఎన్నికల ట్రైనర్లు.
కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, ఈవీఎంలు ఎలా పని చేస్తాయో వివరిస్తున్నారు. ఓటు వేసిన తర్వాత ఓటర్ స్లిప్ రాని పక్షంలో ఓటరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఒకవేళ ఓటు వేయడానికి వచ్చిన వారికి ఏవైనా సందేహాలు వస్తే, అక్కడ వాటిని తీర్చడానికి సిబ్బంది ఉంటారని తెలిపారు. ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటరు ఐడీ లేదా ఎలక్షన్ కమిషన్ గుర్తించిన ఐడీ ప్రూఫ్‌లను తీసుకురావాలని సూచించారు. సాంకేతిక సమస్యలొస్తే ఏం చేస్తారు, ఓటు వినియోగించుకున్నట్లు ఎలా నిర్ధారించుకోవాలి ఇతర అంశాలపై మాస్టర్ ట్రైనర్ నాగరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి.