"రాగల మూడు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం" - IMD Officer On Weather Report - IMD OFFICER ON WEATHER REPORT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-05-2024/640-480-21572658-thumbnail-16x9-imd-officer-interview.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 27, 2024, 8:07 PM IST
IMD Officer Sravani Interview With ETV Bharat : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం వరకు తీవ్రమైన ఎండ కాస్తుంటే, సాయంత్రమైతే చాలు అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై వానలు కురుస్తున్నాయి. అదేవిధంగా గత వారం రోజుల పాటుగా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి వివరించారు. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాష్ట్రంలో అక్కడ అక్కడ వర్షాలు కురిశాయి.
దీనితోపాటుగా ఉత్తరాది నుంచి రాష్ట్రంలోకి వీస్తున్న వేడి గాలుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అందువల్లే పలుచోట్ల 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నట్లు వివరించారు. ఇదేవిధమైన వాతావరణం మరో మూడు రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కాగా రాగల మూడు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో ఈటీవీ భారత్ ముఖాముఖి.