రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ - IMD Officer On Weather Report - IMD OFFICER ON WEATHER REPORT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/640-480-22351434-thumbnail-16x9-rains.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 1, 2024, 7:58 PM IST
|Updated : Sep 1, 2024, 10:43 PM IST
Hyderabad IMD Officer Dharma Raju Interview : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు రోజుల నుంచి ఉమ్మడి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. 14 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన, మిగిలిన జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఇచ్చామని చెబుతున్నారు.
ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో గంటకు 30-40 కి.మి వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అత్యంత భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశం కూడా ఉందన్నారు. వాతావరణ సమాచారాన్ని ఆయా శాఖలకు ఇస్తూ హెచ్చరికలు జారీచేస్తున్నామని వివరించారు. వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి.