రాష్ట్రంలో వరుస సెలవులు - యాదాద్రికి పోటెత్తిన భక్తులు - Yadadri Temple Rush
🎬 Watch Now: Feature Video
Published : Apr 11, 2024, 1:44 PM IST
Huge Rush AT Yadadri Temple : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం స్వామివారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారి నిత్య కల్యాణం, సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో పాల్గొన్న భక్తులు నరసింహుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పండితులు యాదాద్రీశుని విశిష్టత గురించి విన్నవిస్తున్నారు. భక్తి కీర్తనలతో స్వామివారికి పూజలు చేస్తున్నారు.
భక్తుల తాకిటి ఎక్కువగా ఉండడంతో ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు ఎండా కాలం కావడంతో తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు.