మేడారం జాతరకు పెరుగుతున్న భక్తుల రద్దీ - ముందస్తు మొక్కులు సమర్పణ ముమ్మరం
🎬 Watch Now: Feature Video
Huge Devotees Rush at Medaram Jatara in Mulugu : మహా కుంభమేళగా పిలిచే మేడారం వనదేవతల మహాజాతరకు సమయం దగ్గరపడుతున్న కొలదీ భక్తుల రద్దీ అధికమవుతోంది. దారులన్నీ మేడారం వైపే అన్నట్లుగా, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశం నలువైపుల నుంచి వాహనాలు మేడారం వైపు సాగుతున్నాయి. ఈ నెల 21న ఈ గిరిజన జాతర ప్రారంభం కానుండగా, ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాట పడుతున్నారు. జాతర ప్రారంభమైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో చాలామంది భక్తులు ముందస్తు మొక్కులు సమర్పిస్తున్నారు.
Sammakka Saralamma Jatara 2024 : ఆదివారం కావడంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల తనీలాలు సమర్పించుకొని వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వద్ద భక్తులు బెల్లాన్ని బంగారంగా పిలుచుకుంటూ భక్తితో సమర్పించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా వస్తోన్న భక్తులు మేడారం అభయారణ్యంలో వన భోజనాలు చేసి ఉల్లాసంగా గడుపుతున్నారు.