ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు - 62 ఏళ్లు పూర్తయ్యే వరకూ కొనసాగవచ్చని స్పష్టం - High Court on Employes Petition

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 10:04 AM IST

thumbnail
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు - 62 ఏళ్లు పూర్తయ్యే వరకూ కొనసాగవచ్చని స్పష్టం (ETV Bharat)

High Court on Agriculture Employees Petition: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు 62 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసేందుకు అర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు వర్తింపజేయాలని ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ మేరకు న్యాయస్థానం తీర్పనిచ్చింది. 60 ఏళ్లకు పదవీ విరమణ చేసి వారికి ఇంకా 62 ఏళ్లు పూర్తి కాకుంటే ఆ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 60 ఏళ్లు పూర్తి కావడానికి ముందు వ్యాజ్యం దాఖలు చేసిన వారికి మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకూ వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు వేయగా కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పీఏసీఎస్‌లోని సేవకులు, అధికారులు 62 ఏళ్లు పూర్తి అయ్యాకే పదవీ విమరణ చేసేందుకు అర్హులని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.