ఓటు సక్రమంగా వినియోగించుకోండి- సరైన నాయకున్ని ఎన్నుకోండి: హీరో సుమన్ - hero suman comments on vote - HERO SUMAN COMMENTS ON VOTE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 6:50 PM IST
Hero Suman Comments On Vote: ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సినీ హీరో సుమన్ అన్నారు. ప్రజల కోసం ఎవరు కష్టపడ్డారని అనిపిస్తే వారికే ఓటు వేయాలని సినీనటుడు (Cine Hero) సుమన్ పేర్కొన్నారు. ఎన్నికలు అయిన తరువాత బాధపడేకన్నా ముందే ఆలోచించి సరైన నాయకున్ని ఎన్నుకోవాలని తెలిపారు.
Everyone Should Think Before Vote: జీవితంలో సాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దని, రాజకీయ నాయకులు దొంగలు, అవినీతిపరులు (Corruption) అని ప్రజలు తిడుతున్నారని, రాజకీయ నాయకుల వద్ద డబ్బులు తీసుకుని వారిని అవినీతి పరుల్ని చేసింది ప్రజలేనని సుమన్ ఎద్దేవా చేశారు. అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకుని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారని ఇది సరైన పద్దతి కాదని సుమన్ స్ఫష్టం చేశారు. ఎన్నికల ముందు, ఫలితాలు తరువాత వచ్చిన రాష్ట్రంలో తరువాత చాలా మార్పులు వస్తాయని తెలిపారు.