CM Chandrababu Discussions with Ministers: మంత్రివర్గ సమావేశం ముగిశాక దిల్లీ పరిణామాలు, తాజా అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చలు జరిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం సేకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. మంత్రులుగా, ప్రభుత్వపరంగా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో సమాచారం తెప్పించుకుంటున్నట్లు వివరించారు. 6 నెలల పనితీరుపై ముగ్గురు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని సీఎం వెల్లడించారు. రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌లు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ అందజేశారన్నారు. మంత్రులు ఫీల్డ్ విజిట్స్ పెంచాలని సూచించారు. సోషల్ మీడియాను కొందరు మంత్రులు సద్వినియోగం చేసుకోవట్లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనితీరుపై ప్రత్యేకంగా మానిటర్: కక్ష సాధింపులు కాకుండా విలువులతో కూడిన రాజకీయాలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టే సమయం కుదింపు దస్త్రాన్ని తిరస్కరించారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని నిర్ణయించారు. శాఖల్లో దస్త్రాలు పేరుకు పోతుండటం, మంత్రులు సక్రమంగా సాంకేతికత వినియగించకపోవటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నానని తెలిపారు. మంత్రి వద్దకు ఏదైనా దస్త్రం వచ్చి ఎంత సేపు పెండింగ్‌లో ఉంటోందో ప్రతీదీ తనకు తెలుసునని అన్నారు. ఇంచార్జ్ మంత్రులు ఇంకా కొందరు జిల్లాలకు వెళ్లకపోవటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయం ఊరికే రాదు - కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి
అనని మాట అన్నట్లుగా తప్పుడు ప్రచారం: సున్నితమైన అంశాలపై ఒక్కోసారి మంచి ఉద్దేశంతోనే మాట్లాడినా కొందరు చెడుగా తీసుకువెళ్తారని అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అని తాను అనని మాటని అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని మంత్రుల వద్ద గుర్తు చేసుకున్నారు. ఇవాళ అంబేడ్కర్ విషయమై దిల్లీలో జరుగుతున్న వ్యవహారం ఈ తరహాలోనే ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్‌కు తగిన గౌరవం లభించలేదని వారి పాలనలోనే అంబేడ్కర్ ఓటమి పాలయ్యారని ప్రస్తావించారు.
వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని తెలిపారు. ఎవరి హయాంలో అంబేడ్కర్‌కు గుర్తింపు వచ్చిందనే తదితర అంశాలపై చర్చ జరగాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. పార్లమెంటులో జరిగిన పరిణామాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి లోకేశ్‌కు వివరించారు.
'సజ్జల భార్గవ్‌రెడ్డికి నోటీసులు జారీ చేయండి' - పోలీసులకు హైకోర్టు ఆదేశం