ETV Bharat / offbeat

పిండిలో ఈ ఒక్కటి వేస్తే చాలు - చపాతీలు ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయి! - SOFT CHAPATI RECIPE

చపాతీలు ఇంత మెత్తగా ఎప్పుడూ చేసి ఉండరు! - ఈ ట్రిక్ తెలిస్తే ప్రతిరోజు ఇలానే చేస్తారు!

Soft Chapati Recipe in Telugu
Soft Chapati Recipe in Telugu (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 3:39 PM IST

Soft Chapati Recipe in Telugu : మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది రాత్రి చపాతీలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఇంట్లో చపాతీలు మెత్తగా, మూడు వేళ్లతో తుంచేలా రావాలని అందరూ ఆశిస్తారు. కానీ, ఎంత ట్రై చేసినా ఎప్పుడూ చపాతీలు గట్టిగా వస్తుంటాయి. ఇక్కడ చపాతీ పిండి కలిపేటప్పటి నుంచి చపాతీ కాల్చుకునే వరకు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మృదువైన రొట్టెలను తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్​ మీకోసం.

  • ఎక్కువ మంది చపాతీ చేసేందుకు మార్కెట్లో దొరికే ఏదో ఒక పిండి తెచ్చి వాడుతుంటారు. కానీ, స్వచ్ఛమైన గోధుమ పిండి ఉపయోగించాలి అప్పుడే చపాతీలు సాఫ్ట్​గా వస్తాయి.
  • ఇక్కడ మీరు గోధుమలను కొని, పిండి మర ఆడించుకోవచ్చు. సాధ్యం కాకపోతే మార్కెట్లో బ్రాండెడ్ గోధుమ పిండి ప్యాకెట్లను కొనుగోలు చేయండి.
  • చపాతీలు మెత్తగా రావడానికి మీరు ముందుగా ఒక బాగా పండిన అరటి పండుని చేతితో గిన్నెలో మెదుపుకోండి. ఇలా చపాతీ పిండిలోకి అరటి పండు గుజ్జు వేసుకోవడం వల్ల చపాతీలు సూపర్​ సాఫ్ట్​గా వస్తాయి.
  • తర్వాత మీరు జల్లించిన చపాతీ పిండిని గిన్నెలోకి తీసుకోండి. ఇందులో అరటి పండు గుజ్జు వేసి చేతితో బాగా కలుపుకోండి.
  • చపాతీ పిండి పొడిపొడిగా కలుపుకున్న తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ పిండిని కలుపుకోండి.
  • ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోయడం వల్ల చపాతీ పిండి మృదువుగా ఉండదు.
  • చపాతీ పిండి మెత్తగా కలుపుకున్న తర్వాత దానిపై తడి వస్త్రం కప్పి 10 నిమిషాలు అలా వదిలేయండి.
  • చపాతీలు చేసే ముందు పిండిని మరోసారి కలిపి, కొద్దిగా నూనె వేయండి.
  • మళ్లీ చపాతీ పిండిని బాగా కలిపి, చిన్న ముద్దలుగా చేసుకోండి.
Soft Chapati
Soft Chapati (Getty Images)
  • ఇప్పుడు చపాతీ పీటపై కాస్త పొడి పిండి చల్లి పిండి ముద్ద ఉంచండి. చపాతీ కర్రతో చపాతీ తయారు చేయండి.
  • ఆపై కొద్దిగా నూనె వేసి మొత్తం స్ప్రెడ్​ చేయండి. తర్వాత చపాతీని మధ్యలోకి మడవండి. దీనిపై కూడా కొద్దిగా నూనె చల్లండి. ఆపై మరో వైపు చపాతీ మడతపెట్టండి. ఇలా నాలుగు వైపులా చపాతీ మడతపెట్టుకుంటూ స్క్వేర్​ షేప్​లో వచ్చేలా తయారు చేసుకోవాలి.
  • ఇలా చపాతీ ముద్దలన్నింటినీ స్క్వేర్​ షేప్​లో తయారు చేసుకోవాలి.
  • ఇప్పుడు చపాతీ పీటపై స్క్వేర్​ షేప్​లో చేసిన ఓ చపాతీ ముద్దను ఉంచి రుద్దుకోండి.
  • ఇక్కడ మీరు మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా కూడా చపాతీని రుద్దుకోవచ్చు.
  • ఇలా రుద్దుకున్న చపాతీని వేడివేడి పెనం మీద వేసి అర నిమిషం వదిలేయండి.
  • ఇప్పుడు చపాతీని ఓ వైపు తిప్పి కొద్దిగా ఆయిల్​ వేయండి. ఆపై అంచుల వెంబడి నూనె వేసి కాల్చుకోండి.
  • చపాతీని ఎప్పుడైనా స్టవ్​ హై ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి కాల్చుకుంటే లోపల వరకు ఉడికి సాఫ్ట్​గా ఉంటాయి.
  • చపాతీలను లో ఫ్లేమ్​లో కాల్చుకుంటే చెమ్మ ఆరిపోయి గట్టిగా మారుతాయని గుర్తుంచుకోండి.
  • అంతే ఈ టిప్స్​ పాటిస్తూ చపాతీలు చేసుకుంటే ఎన్ని గంటలైనా సరే మృదువుగా ఉంటాయి.
  • వీటిని మీరు ఏ నాన్​వెజ్​ కర్రీలు, వెజ్​ కర్రీలతో తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి.
  • ఈ చిట్కాలు నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.

"హోటల్​ స్టైల్​ క్రిస్పీ దోశలు" - పక్కా కొలతలతో పర్ఫెక్ట్​గా వస్తాయి!

టిఫిన్స్​లోకి ఎప్పుడూ పల్లీ చట్నీనే కాదు - ఇలా​ "మురుగన్​ చట్నీ" ఓసారి ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.