ETV Bharat / state

అడ్డుకున్నా ఆగలేదు - వాటిపైకి దూసుకెళ్లిన హైడ్రా బుల్డోజర్లు - HYDRA DEMOLITIONS IN ALKAPURI

అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారన్న కారణంతో షట్టర్లను నేలమట్టం చేసిన హైాడ్రా - అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు

Hydra Demolition in Alkapuri Colony in Hyderabad
Hydra Demolition in Alkapuri Colony in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Hydra Demolition in Alkapuri Colony in Hyderabad : తెలంగాణలో హైడ్రా మరోసారి కొరడా ఝుళిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై హైడ్రా, మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని 'అనుహార్‌ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్‌'లో ఎటువంటి అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారన్న కారణంతో నాలుగు షట్టర్లను అధికారులను తొలగించారు.

గురువారం ఉదయం అక్కడికి చేరుకున్న హైడ్రా, మున్సిపల్, పోలీసులు అధికారులను అపార్ట్‌మెంట్‌లోని పలువురు నిలువరించారు. వారి అభ్యర్థనలను లెక్కచేయని అధికారులు రెండు జేసీబీలతో షట్టర్లను ధ్వంసం చేశారు. దీంతో మున్సిపల్, హైడ్రా అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 సంవత్సరంలో హెచ్ఎండీఏ అనుమతులతో రామిరెడ్డి అనే యజమాని గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్, 5 అప్పర్ ఫ్లోర్లతో 'అనుహార్‌ మార్నింగ్ రాగా' అపార్ట్‌మెంట్స్‌ను నిర్మించారు.

అనంతరం అందులో నివాసం ఉంటున్న వారి కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌లో బ్యాంకు, నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్ల దుకాణాలను ఏర్పాటు చేసి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి స్థానిక మున్సిపల్, హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్‌లో అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

భూకబ్జాదారులపై కఠిన చర్యలు తప్పవు - మరోసారి హెచ్చరించిన రంగనాథ్‌

ఆ ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ నెల 7న అక్కడికి వెళ్లి అపార్ట్‌మెంట్‌లోని వాణిజ్య సముదాయాలను ప్రత్యక్ష్యంగా పరిశీలించారు. అనంతరం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిని తొలగించాలని అధికారులకు సూచించారు. అంతకుముందే మున్సిపల్ అధికారులు నవంబర్ 27న ఆ అపార్ట్‌మెంట్స్‌కు నోటీసులు జారీ చేసి ఏడు రోజుల్లో తొలగించాలని ఆదేశించారు.

ఆ నోటీసులకు అపార్ట్‌మెంట్‌ యజమాని నుంచి స్పందన రాకపోవడంతో ఈరోజు ఉదయం అక్కడికి చేరుకున్న సిబ్బంది నాలుగు షట్టర్లను తొలగించారు. ఈ ఘటనపై యజమానితోపాటు అక్కడి షట్టర్లలో వ్యాపారం చేస్తున్న వారు తీవ్రంగా మండిపడ్డారు. కాసేపు సమయం కోరినా అధికారులు పట్టించుకోకుండా కూల్చివేతలు జరిపారని మండిపడ్డారు. అపార్ట్‌మెంట్‌లో షట్టర్ల తొలగింపుపై హైడ్రా అధికారిక ప్రకటన చేయనున్నట్లు కమీషనర్ రంగనాథ్ వెల్లడించారు.

హైడ్రా వాళ్ల జోలికి వెళ్లదు - కూల్చివేతలపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో ధనవంతులే ఎక్కువ - ఎవరినీ ఉపేక్షించం: రంగనాథ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.