మెదక్​ను ముంచెత్తిన వాన - నీటమునిగిన కార్లు, కొట్టుకుపోయిన బైకులు - Heavy Rain In Medak

🎬 Watch Now: Feature Video

thumbnail

Heavy Rains In Medak : ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ పట్టణంలో 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, దాదాపు 2 గంటల పాటు కుండపోత వాన కురిసింది. దీంతో రాందాస్ చౌరస్తా, ఎంజీ రోడ్డు, ఆటో నగర్, వెంకట్రావ్ ​నగర్, సాయినగర్ కాలనీలు జలమయమయ్యాయి.

రాందాస్ చౌరస్తా నుంచి జేఎస్ రోడ్డుకు వెళ్లే దారిలో పాత గాంధీ లైబ్రరీ వద్ద వరద ఉద్ధృతికి పలు బైకులు కొట్టుకుపోయాయి. సాయినగర్ కాలనీలోని రోడ్లపై వరద నీరు నిలిచి కార్లు నీట మునిగాయి. ఆటోనగర్ నుంచి వెంకట్రావ్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో రాకపోకలకు ఆటంకం కలిగింది. డ్రైనేజీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఆయా చోట్ల వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక రోడ్లు జలమయమయ్యాయి. దీంతో మున్సిపల్ అధికారులు స్పందించి, సహాయక చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.