''హెల్త్ ఆన్ అస్' మెడికల్ కేర్, డాక్టర్స్‌ను ఇంటికి తెస్తుంది' - యాప్‌ను ఆవిష్కరించిన పవన్ కల్యాణ్ - హెల్త్ ఆన్ అస్ యాప్
🎬 Watch Now: Feature Video
Published : Feb 26, 2024, 10:30 AM IST
Health Onus App Launched By Pawan Kalyan : కరోనా తర్వాత మెడికల్ కేర్‌లో అనేక మార్పులు సంభవించాయని, అనేక సార్లు ఇంటి వద్దే పూర్తి మెడికల్ దొరికితే బావుంటుందన్న అభిప్రాయం కలుగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన హెల్త్ ఆన్ అస్ యాప్ లాంఛ్ కార్యక్రమంలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి హెల్త్ ఆన్ అస్ ఎండీ భరత్ రెడ్డి, ఛైర్మన్ లింగమనేని రమేశ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ యాప్‌ను లాంఛ్ చేసిన ఆయన కొవిడ్ సమయంలో తన తల్లిని ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు.
Pawan Kalyan In Hyderabad : ఒక్కో సారి ఆస్పత్రిలో పడకలు కావాలంటే ఏకంగా మంత్రులతోనే రికమండ్ చేయించాల్సిన పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి స్థాయి వైద్య సదుపాయాలను ఇంటి వద్దకే అందించే హెల్త్ ఆన్ అస్ లాంటి యాప్‌లు ఎంతో మేలు చేస్తాయని పవన్ పేర్కొన్నారు.