LIVE : మెదక్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీ పాల్గొన్న హరీశ్‌రావు - Harishrao MP Election Campaign - HARISHRAO MP ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : Apr 25, 2024, 12:27 PM IST
|Updated : Apr 25, 2024, 12:44 PM IST
Harishrao Lok Sabha Election Campaign : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలో అత్యధిక స్థానాలు సాధించింది తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. అందుకు కాంగ్రెస్, బీజేపీల కంటే ముందునుంచే బీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల సమరాన్ని పూర్తిస్థాయిలో పూరించింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో రైతు రుణమాఫీ గురించి హరీశ్‌రావు, సీఎం రేవంత్ రెడ్డిలు సవాల్ విసురుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు.మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లే ర్యాలీకి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు అధిక మొత్తంలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేస్తున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ హరీశ్‌రావు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నారు.
Last Updated : Apr 25, 2024, 12:44 PM IST