ప్రభుత్వ వైఫల్యాలు తెలిసేలా పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించాం : మాజీ మంత్రి హరీశ్‌రావు - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video


Published : Apr 14, 2024, 7:48 PM IST
Harish Rao Fire on Congress : రైతులకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డికి లక్షలాదిగా పోస్టుకార్డులు రాయనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి తిరోగమనం దిశగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లోపు రేవంత్ సర్కార్ వడ్లు, మక్కలకు రూ.500 బోనస్ చెల్లించాకే ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
Harish Rao on BRS Meeting Arrangements : కాంగ్రెస్, బీజేపీలు తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాదం వినిపించాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేయించాలన్నా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 16న అందోలు నియోజకవర్గం సుల్తాన్‌పూర్‌లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం గులాబీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.