బీఆర్ఎస్పై ప్రజల్లో నమ్మకం ఉంది - ఏం జరిగినా మన మంచికే : హరీశ్‌రావు - Harish Rao on Group 1 Jobs
🎬 Watch Now: Feature Video
Published : Feb 4, 2024, 3:51 PM IST
|Updated : Feb 4, 2024, 4:00 PM IST
Harish Rao Fire on Congress Govt Over Group 1 Jobs : రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు ప్రజలకు మొండి చేయి చూపిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన మార్పు ఏదైనా ఉందంటే ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లను రోడ్డున పడేయటం, వృద్ధులకు జనవరి నెలలో పింఛన్ ఇవ్వకపోవడం అని ఎద్దేవా చేశారు. ఇవాళ పఠాన్‌చెరు నియోజవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిందన్న హరీశ్‌రావు, ఏం జరిగినా మన మంచికేనన్నారు. ప్రజల్లో కూడా బీఆర్ఎస్పై నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ దుష్ప్రచారం వల్ల ఓటమి పాలయ్యామన్న మాజీ మంత్రి, హామీల అమల్లో మాత్రం జాప్యం జరిగితే ప్రజల తరఫున పోరాడటంలో ఓడిపోమన్నారు. ఫిబ్రవరి 1న ఇస్తామన్న గ్రూప్-1 నోటిఫికేషన్ ఏమయ్యిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.