ఇందిరాపార్క్ వద్ద గురుకుల ఉపాధ్యాయుల ఆందోళన - సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ - Gurukul Teachers Dharna - GURUKUL TEACHERS DHARNA
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2024, 1:51 PM IST
Gurukul Teachers Dharna at Indira Park : గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు తమ పోరాటం కోసం అడిగిన 25 డిమాండ్స్ న్యాయమైనవే అని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నర్సిరెడ్డి స్పష్టం చేశారు. మెస్ ఛార్జీలు సవరించండి అని ఉపాధ్యాయులు కోరుకోవడం సంతోషకరం అని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల వేళలు మార్చాలి, మెస్ ఛార్జీలు పెంచాలి, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నారు. గురుకులాల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల హెల్త్ కార్డులు తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు.
మెస్ ఛార్జీల ధరలు పెంచితే విద్యార్థులకు నాణ్యమైన భోజనం లభిస్తుందని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే ఉపాధ్యాయులు పోరాటం చేయడం హర్షించదగ్గ విషయమని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. గురుకులాల సమస్యల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. గురుకులాలకు సొంత భవనాలు కట్టించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఉపాధ్యాయులను నైట్ వాచ్ మెన్లుగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు.