కార్యకర్తలపై కేసులు,వేధింపులకు బదులు ఉంటుంది- పలాస శంఖారావం సభలో గౌతు శిరీష - మంత్రి అప్పలరాజుపై గౌతు శిరీష
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2024/640-480-20724813-thumbnail-16x9-gowthu-sirisha-fire-on-minister-sidiri-appalaraju.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 8:16 PM IST
Gowthu Sirisha Fire on Minister Sidiri Appalaraju: అధికారం అడ్డంపెట్టుకుని మంత్రి సీదిరి అప్పలరాజు కొండలను మింగేశాడని తెలుగుదేశం నేత గౌతు శిరీష తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మట్టిని అమ్మకుని వేలకోట్లు వెనకేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో తెలుగుదేశం కార్యకర్తలపైన పెట్టిన కేసులు, వేధింపులకు బదులు తీర్చుకుని తీరతామని గౌతు శిరీష శపథం(Gowthu Sirisha Challenge) చేశారు. పలాసలో నిర్వహించిన నారా లోకేశ్ శంఖారావం యాత్ర (Nara Lokesh Sankharavam Yatra) లో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్‌లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర ప్రారంభించారు.
"అధికారం అడ్డంపెట్టుకుని మంత్రి అప్పలరాజు కొండలను మింగేశాడు. మట్టి అమ్మకం ద్వారా వేలకోట్లు వెనకేసుకున్నారు. ఈ ఐదేళ్లలో తెలుగుదేశం కార్యకర్తలపైనా కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. అందుకు బదులు తీర్చుకుని తీరతామని శపథం చేస్తున్నా." - గౌతు శిరీష, టీడీపీ నేత