ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని శుద్ధి చేసిన గవర్నర్ తమిళిసై - Governor Tamilisai Khairtabad news
🎬 Watch Now: Feature Video


Published : Jan 20, 2024, 6:58 PM IST
Governor Tamilisai Sundararajan Cleaned Sri Hanuman Temple : శ్రీరామ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఆలయాల శుద్ధికి ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై నగరంలో శ్రమదానం చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని శ్రీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ ఆలయ పరిశుభ్రతలో పాల్గొన్నారు. స్వయంగా క్లీనర్ చేత పట్టుకుని ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సతీమణి కావ్యరెడ్డి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చెప్పట్టారు.
BJP Leaders Participate in Cleanliness Campaign : సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయాన్ని బీజేపీ నాయకుడు కొమురయ్య శుద్ది చేశారు. ఆలయ స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా మొదటగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో చెత్త చెదారాన్ని పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.