రూ. కోటి 70లక్షల నగదుతో అమ్మవారి అలంకరణ - ఎక్కడో చూడండి - GODDESS DECORATED WITH 1 CRORE
🎬 Watch Now: Feature Video
Published : Oct 9, 2024, 12:00 PM IST
Goddess Decorated with Cash: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్లో శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ శక్తి రూపిని దుర్గాదేవి అమ్మవారిని దేవి దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో ఐదోరోజు మహాలక్ష్మి అవతారంలో అలంకరణ చేసి పూజించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ. కోటి 70 లక్షల పైచిలుకు నగదు నోట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మొదటి వార్షికోత్సవంలోనే రూ. కోటి 70 లక్షల పైచిలుకు నగదుతో మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని పూజించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిర్వాహకులు చెబుతూ రూ. కోటి 50 లక్షలు వస్తాయనుకుంటే రూ.కోటి 70 లక్షలకు పైగా నగదు సమకూరిందని ఇదే నిదర్శనమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి.