ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి : డీజీపీ రవిగుప్తా - GHMC Voter Slip Distribution - GHMC VOTER SLIP DISTRIBUTION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 3:20 PM IST

GHMC Commissioner Voter Slip Distribution In Hyderabad : మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల కోసం నగరంలో ఓటరు స్లిప్ ల పంపిణీ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ మొదలుపెట్టారు. బంజారాహిల్స్​లోని డీజీపీ రవిగుప్తా నివాసానికి అధికారులతో కలిసి వెళ్లిన రోనాల్డ్ రాస్ రవిగుప్తకు ఓటరు స్లిప్, స్టిక్కర్ అందేశారు. ఈ సందర్భంగా ఓటర్లు మే 13న తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని డీజీపీ రవిగుప్తా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.

అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్​రాజ్​ను ఆయన నివాసంలో కలిసి రోనాల్డ్​రాస్ ఓటరు స్లిప్ అందజేశారు. ఓటర్ స్లిప్, స్టిక్కర్ల పంపిణీ వివరాలను వికాస్​రాజ్​కు వివరించారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వికాస్ రాజ్ కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.