పారిశుద్ధ్య కార్మికుల ఎఫెక్ట్ - చెత్తాచెదారంతో నిండిపోయిన ఏపీ సచివాలయం - Garbage in AP Secretariat
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 4:44 PM IST
Garbage in AP Secretariat: రెండు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు (Sanitation Workers) ఆందోళన చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం చెత్తా చెదారం, వ్యర్ధాలతో నిండిపోయింది. సచివాలయ పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ శానిటరీ సిబ్బంది విధులు బహిష్కరించటంతో రెండు రోజులుగా ఏపీ సచివాలయంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఎక్కడి చెత్త అక్కడే వదిలివేయటంతో పాటు, సచివాలయంలోని ప్రాంగణాన్ని శుభ్రం చేయకపోవటంతో చెత్తాచెదారంతో నిండిపోయింది.
సచివాలయంలోని మరుగుదొడ్లు దుర్గంధభరితంగా మారాయి. దీంతో సచివాలయ ఉద్యోగులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా ఆప్కాస్‌లో (Andhra Pradesh Corporation for Outsourced Services) చేర్చాలని శానిటరీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. సీఆర్డీఏ ఇచ్చే పెన్షన్ కూడా వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయటం దారుణమని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత అయిదేళ్లుగా ఆప్కాస్‌లోకి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం తమను మోసం చేసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో చాలీచాలని జీతంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు అంటున్నారు. కాంట్రాక్టర్ మారిన ప్రతిసారి తమ జీతంలో కోత విధిస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. రేషన్ కార్డు సహా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.