ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల కలకలం - ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు - Ganja case Khammam news
🎬 Watch Now: Feature Video


Published : Jan 30, 2024, 12:52 PM IST
Ganja Chocolates in Khammam : గంజాయి తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. పోలీసులు ఎప్పటికప్పుడు గంజాయి సరఫరాను అడ్డుకుంటున్నా, ఏదో ఒకదారిలో సమాజంలో అది చిచ్చురేపుతూనే ఉంది. దీని బారినపడి ఎంతోమంది యువత, ఇబ్బందుల పాలవుతుండగా, ఇప్పుడు చిన్న పిల్లలనూ గంజాయి ముఠాలు వదలడం లేదు. గంజాయి కలిపిన చాక్లెట్లు అందిస్తూ వారి ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి చాక్లెట్లు, గంజాయి వినియోగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఎన్ని చర్యలు చేపట్టినా నిర్మూలన కష్టతరంగా మారింది.
Ganja Gang Arrest in Khammam : తాజాగా ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల రాకెట్ గుట్టురట్టు అయింది. ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లతో పాటు మరికొన్ని కిలోల గంజాయి లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ఏపీలోని అటవీ ప్రాంతం నుంచి గంజాయి చాక్లెట్లు సరఫరా అవుతున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.