తండ్రి ఆటో కిందపడి కొడుకు మృతి - పార్కింగ్ చేస్తుండగా ప్రమాదం - krishna district auto accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 6:43 PM IST

Four Years Child Died in an Auto Accident in Krishna District : తండ్రి ఆటో కిందపడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో వరిగంజి మురళీ కృష్ణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మురళీ కృష్ణ ఆటో పార్క్​ చేస్తున్న క్రమంలో రివర్స్​ చేస్తుండగా, ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న బాలుడు రిషిక్​ (4) ప్రమాదవ శాత్తు వాహనం వెనుక టైర్​ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు.

Seriously Injured Child was Taken to a Local Hospital : తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న తన కుమారుడ్ని(రిషిక్​) హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్​కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి రిషిక్​ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. రిషిక్​ మరణ వార్త విన్న తల్లిదండ్రులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనతో మోటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.