తెలుగు ప్రజల జీవితాల్లో రామోజీరావు మమేకం : మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ - EX CJI JUSTICE NV RAMANA CONDOLENCES TO RAMOJI RAO - EX CJI JUSTICE NV RAMANA CONDOLENCES TO RAMOJI RAO
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 2:44 PM IST
|Updated : Jun 8, 2024, 3:18 PM IST
EX CJI Justice NV Ramana Condolences to Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణం పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్సిటిలో ఉంచిన ఆయన పార్థివదేహానికి సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలుగు భాష సంస్కృతి, పత్రికాస్వేచ్ఛ, ప్రసార మాధ్యమాలు అన్నింటికి కూడా రామోజీరావు ప్రతీకని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
Ramoji Rao Passed Away : అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు రామోజీరావు అని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రామోజీ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు తెలుగు ప్రజల జీవితాల్లో రామోజీరావు మమేకమై ఉన్నారని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
TAGGED:
RAMOJI RAO PASSED AWAY