రామమడుగులో శ్రీరాముడి పాదగుర్తులు - వనవాసంలో ఈ దారినే నడిచారని భక్తుల నమ్మకం - Srirama Pada Mudralu
🎬 Watch Now: Feature Video
Published : Jan 21, 2024, 12:28 PM IST
Footprints of Lord Sri Rama In Karimnagar : కొన్ని ఆలయాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. అలాంటి దేవాలయాలను భక్తులు కొంగు బంగారంగా కొలుస్తారు. రాముడు అరణ్యవాసంలో వివిధ చోట్ల తిరిగాడని ప్రతీతి. అలాంటి ఓ ప్రదేశమే కరీంనగర్ జిల్లా రామడుగులో కనిపించింది. శ్రీరాముడు తన వనవాసంలో ఈ మార్గం గుండా నడిచి వెళ్లాడని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ శ్రీరాముని పాద గురుతులు పెద్ద శిలపై ఉన్నాయి. సమీపంలోని గోవిందరాజుల గుట్ట, మోగిలిపాయలు మునులతో తపో సంపన్న నేలగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. శతాబ్దాల నాటి సనాతన ధర్మ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రం.
Lord Rama Feet In Ramadugu : వనవాసంలో శ్రీరాముడు ఈ గ్రామం గుండా నడిచి వెళ్లాడని పాద ముద్రలకు పూజలు చేస్తారు. వేములవాడ చాళుక్యుల అనంతర కాలంలో ఇక్కడ విరాజిల్లిన సనాతన ధర్మ వైభవం శిల్పకళ రూపంలో ఉంది. సుమారు వేయి సంవత్సరాల క్రితం చెక్కిన శిల్పాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. స్ధానికంగా పరిపాలించిన గోవిందరాజుల హయాంలో వెలిసిన గుళ్లు, గోపురాలు, కోట పురాతన వైభవాన్ని చాటుతున్నాయి.