ఒక్క చెట్టు - ఐదు అరటి గెలలు - అనంత జిల్లాలో వింత
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 4:59 PM IST
Five Wins To Banana Tree at Dharmapuram: సాధారణంగా అరటి చెట్టుకు ఒక అరటి లేదా రెండు గెలలు రావటం సాధారణం. కానీ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని పెద్దపప్పూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన రవి శంకర్ అరటి తోటలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అరటి గెలలతో విరగకాసింది. ఒక చెట్టుకు 5 అరటి గెలలు ఒకే సారి రావటం పట్ల రైతు (farmer) హర్షం వ్యక్తం చేస్తున్నారు. చుట్టు పక్కల ప్రజలు ఈ వింతను చూసేందుకు బారులు తీరుతున్నారు.
"గత 10 సంవత్సరాలుగా అరటి తోట సాగు చేస్తున్నాను. ఈ పదేళ్లలో ఇటువంటి అద్భుతం ఎప్పుడూ జరగలేదు. అజిత్ జాతికి చెందిన అరటి చెట్టు ఇది. అన్ని అరటి చెట్లకు ఇన్ని అరటి గెలలు వస్తే ఆదాయం బాగుంటుంది. ఇవాళ ఒక చెట్టుకు ఐదు అరటి గెలలు రావడం సంతోషంగా ఉంది."- రవిశంకర్, రైతు