భళా బండి గాయత్రి- టాటా స్టీల్‌ మొదటి మహిళ ఉద్యోగి సక్సెస్ స్టోరీ - Bandi Gayathri success story

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 10:25 PM IST

Bandi Gayathri Success story : భూగర్బ గనుల్లో పనిచేయడం చాలా కష్టమైన పని. ఆక్సీజన్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వెలుతురు సరిగ్గా ఉండదు. అనుక్షణం భయం భయంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పనిచేయాలంటే మగవాళ్లే కాస్త వెనకడుగు వేస్తారు. కానీ ఓ అమ్మాయి భూగర్బ గనుల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. 

114 ఏళ్ల టాటా స్టీల్ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి యువతిగా బండి గాయత్రి గుర్తింపు తెచ్చుకున్నారు. బండి గాయత్రి వాళ్ల నాన్న కెప్టెన్ బండి వేణు సైన్యంలో పనిచేసి పదవీవిరమణ పొందారు. అమ్మ తారక జేపీ మోర్గాన్ అండ్ ఛేజ్‌లో వైస్ ప్రెసిడెంట్. అక్క ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నారు. కానీ బండి గాయత్రి మాత్రం మైనింగ్ ఇంజనీరింగ్‌ను కెరియర్‌గా ఎంచుకున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్లస్ టూ వరకు చదుకున్నారు. ప్రస్తుతం ఝరియాలోని అండర్ గ్రౌండ్ కోల్‌మైన్స్‌లో పనిచేస్తున్నారు. బండి గాయత్రితో ఈటీవీ భారత్ ఇంటర్వ్యూ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.