టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణనష్టం - Fire in timber godown - FIRE IN TIMBER GODOWN
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2024, 2:01 PM IST
Fire Accident in Timber Godown in Jagadgirigutta : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహాదేవపురంలో శ్రీ సాయి ఎంటర్ టింబర్ డిపోలో ఉదయం అగ్రి ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 2 ఫైర్ ఇంజిన్ల సహాయం రంగంలోకి దిగిన వారు మంటలను అదుపు చేశారు.
ఉదయం 7 గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకునే సమయానికి షాపు తెరవకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే మంటలు వ్యాప్తి కాకుండా పోలీసులు సకాలంలో చర్యలు చేపట్టి అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గోడౌన్లోని సామగ్రి మొత్తం మంటల ధాటికి కాలిపోయింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.