స్వీట్ షాప్‌లో ఘోర అగ్నిప్రమాదం - సుమారు రూ. పది లక్షల ఆస్తి నష్టం - Fire Accident in Shop at warangal
🎬 Watch Now: Feature Video
Published : Mar 13, 2024, 7:17 PM IST
Fire Accident at Sweet Shop in Warangal : రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా వరంగల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని వాసవి కాలనీలో స్వాగత్ స్వీట్ హౌస్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోయినప్పటికీ భారీ మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఫర్నిచర్‌తో పాటు మిఠాయిలు అగ్నికి అహుతి అయ్యాయి. సుమారు రూ.పది లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని తెలిపారు.
Massive Fire Accident in Warangal District : సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. దుకాణంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోడంతోనే షాపు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.