గోదాంలో భారీ అగ్నిప్రమాదం - ఆహుతైన 12.88 లక్షల గన్నీ బ్యాగులు - రూ.కోట్లలో నష్టం - Gunny Bags Godwon Fire accident - GUNNY BAGS GODWON FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video
Published : Apr 2, 2024, 10:57 AM IST
Fire Accident At Mahabubnagar Gunny Bags Godown : వనపర్తి జిల్లా పెబ్బేర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గోదాంలో నిలువ చేసిన గన్నీ బ్యాగులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డులోని గోదాంలో రెండో కంపార్ట్‌మెంట్‌ను జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు లీజుకు తీసుకొని, వాటిలో 12 లక్షల 88 వేల గన్నీ బ్యాగులను నిలువ చేశారు. అగ్ని ప్రమాదంలో గన్నీ బ్యాగులకు అంటుకున్న మంటలు ఎగిసిపడి ఇతర కంపార్ట్మెంట్లో ఉన్న సీఎంఆర్ ధాన్యానికీ అంటుకున్నాయి.
మొదటి కంపార్ట్మెంట్లో 14 వేల బస్తాలు, మూడో కంపార్ట్మెంట్లో 63 వేల బస్తాల సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్ యజమానులు భద్రపరిచారు. పెద్ద మొత్తంలో మంటలు చెలరేగడంతో పక్కపక్కనే ఉన్న మొదటి, మూడు కంపార్ట్మెంట్లలోకి మంటలు ప్రవేశించి, వాటిలో ఉన్న సీఎంఆర్ ధాన్యం భారీగా కాలిపోయినట్లు తెలుస్తుంది. అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా, నీటి కొరతతో చాలా సేపు వరకు మంటలు అదుపులోకి రాలేదు.