మహేశ్ బాబు కుమార్తె సితార పేరుతో ఇన్వెస్ట్మెంట్ లింకులు - స్పందించిన జీఎంబీ సంస్థ - Mahesh Babu Daughter Fake Insta
🎬 Watch Now: Feature Video
Published : Feb 10, 2024, 9:41 AM IST
Fake Instagram Account On Sitara Ghattamaneni : రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి క్యూ ఆర్ కోడ్లు, లింకులు, పంపిస్తూ జనం నుంచి డబ్బులను దోచేస్తున్నారు. కొన్నిసార్లు సినీతారలకూ ఇది తప్పడం లేదు. సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు తెరచి పలువురి నుంచి డబ్బు నొక్కేస్తున్నారు. అత్యవసరం అంటూ మెసేజ్‌లు పెడుతూ నగదు దోచేస్తున్నారు.
Fake Account On Mahesh Babu Daughter : తాజాగా నటుడు మహేశ్‌బాబు కుమార్తె ఘట్టమనేని సితార పేరుతో కొందరు నేరగాళ్లు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురికి ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతున్నట్లు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ గుర్తించింది. ఇలాంటివి నమ్మొద్దని వెల్లడించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. సెలబ్రిటీల పేరుతో ఇలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని తమ ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేసింది.