మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మాజీ సర్పంచ్ - సక్సెస్ మంత్ర అదేనంట! - Dasaripally Ex Sarpanch Got 3 Jobs

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 11, 2024, 2:34 PM IST

Ex Sarpanch Got 3 Jobs In Telangana : నా గోల్‌ అదీ, నా గోల్‌ ఇదీ అని చాలా మంది చెబుతుంటారు. దానికోసం నిరంతరం శ్రమిస్తారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, మరే ఇతర అవకాశాలు వచ్చినా తాము ఎంచుకన్న లక్ష్యం వైపే అడుగులేస్తారు. కానీ, కొందరు  మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు. అలాంటి ఓ మహిళ కథే ఇది. 

కరోనా పరీక్షించినా, రాజకీయాలలోకి ప్రవేశించినా తను ఎంచుకున్న గోల్‌ని మాత్రం మరువలేదు. ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలని సంకల్పించింది. ఏకకాలంలోనే టీజీటీ, పీజీటీ, జేఎల్ ఉద్యోగాలకు ఎంపికైంది. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే అంత ఆషామాషీ కాదు. ఒక జాబ్ సాధించడమే గగనమైన ఈ రోజుల్లో ఏకంగా మూడు ఉద్యోగాలకు ఎంపికై మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించింది మహబూబ్​నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లికి చెందిన లంకాల సంతోషమ్మ. భవిష్యత్​లో పీహెచ్​డీ పట్టా పొందడమే తన లక్ష్యం అంటున్న సంతోషమ్మతో ఈటీవీ భారత్ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.