రెవెన్యూ వ్యవస్థను జగన్ భ్రష్టు పట్టించారు- ఫైళ్ల దహనం కేసుపై సమగ్ర విచారణ అనివార్యం: చింతా మోహన్ - Chinta Mohan on Revenue system - CHINTA MOHAN ON REVENUE SYSTEM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 7:06 PM IST
Ex Mp Chinta Mohan Comments on Revenue System in YCP Government : రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితుల పేరుతో ఉన్న విలువైన భూములను కాజేసేందుకే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దహనం చేశారన్నారు. జమాబందీ లెక్కలతో పటిష్టంగా ఉన్న రెవెన్యూ వ్యవస్థను జగన్ సర్వనాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫైళ్ల దహనం కేసులో సమగ్రంగా విచారణ చేపట్టి, రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందని చింతా మోహన్ విమర్శించారు. అమరావతికి 15 వేల కోట్లు గ్రాంట్ ఇవ్వకుండా అప్పు ఇప్పిస్తామనడం సరికాదన్నారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పారేగానీ, బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని చింతా మోహన్ విమర్శించారు.