ETV Bharat / state

వాటర్ బాటిల్ ఉంటే చాలు - కిలోల కొద్దీ చేపలు పట్టొచ్చు - ఎలాగంటే ! - FISH TRAP WITH PLASTIC WATER BOTTLE

సులువుగా చేపలు పట్టేస్తున్న యువకులు - ప్లాస్టిక్‌ బాటిల్, మైదాపిండితోనే ఎర రెడీ

fish_trap
FISH TRAP WITH PLASTIC WATER BOTTLE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2024, 2:12 PM IST

Updated : Dec 26, 2024, 8:02 PM IST

FISH TRAP WITH PLASTIC WATER BOTTLE : చేపలు పట్టేందుకు ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని అనుసరిస్తారు. మత్స్యకారులు ఎక్కువగా వలలు ఉపయోగిస్తుంటారు. ఇక యువత అయితే సరదాగా ఎరలు ఉపయోగించి, తాము కూడా ఏ మాత్రం తక్కువ కాదంటూ నిరూపించుకుంటారు. ఇలా కొన్ని సార్లు సరదాగా వెళ్లి కిలోల కొద్దీ చేపలు పట్టుకొని వస్తుంటారు. తాజాగా యానాంలో కొంతమంది యువకులు చేపలు పట్టేందుకు కొత్త టెక్నిక్​ని కనిపెట్టారు. ఇందుకోసం కేవలం ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలు. కిలోల కొద్దీ చేపలు పట్టుకుని తీసుకుని వెళ్లొచ్చు. ఇంతకీ వారు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కొంతమంది యువకులు సులువుగా చేపలు పట్టేస్తున్నారు. ఇందుకు కేవలం వారు ఒక ప్లాస్టిక్‌ బాటిల్, మైదాపిండి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ సీసాను పైభాగం తొలగించి, మిగిలిన భాగంలో మైదా పిండిని ముద్దగా చేసి పెడుతున్నారు. ఇప్పుడు దానికి తాడును కట్టి నదిలోకి జార విడుస్తున్నారు.

బాటిల్​లోని మైదా పిండి తినేందుకు అందులోకి వచ్చిన చేపలు తిరిగి వెనక్కి వెళ్లలేకపోతున్నాయి. కొద్ది సేపటికి ప్లాస్టిగ్ బాటిల్​ని ఒడ్డుకు లాగి అందులోని చేపను తమ బుట్టలో వేసుకుంటున్నారు. ఇలా 2 కేజీల వరకూ చేపలు దొరుకుతున్నాయని మత్స్యకారులు, యువత తెలిపారు. స్థానిక జీఎంసీ బాలయోగి వారధి పక్కన గోదావరి ఒడ్డున గుంపులు గుంపులుగా యువత కూర్చుని ఇదే పనిలోనే ఉంటున్నారు.

బొమ్మిడాయి రూపం పులస రుచి - ఈ చేపను ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే!

చేపలతో ఎన్నో ప్రయోజనాలు: నాన్​వెజ్ ప్రియులు చికెన్, మటన్​తో పాటు చేపలు ఎక్కువగా తింటుంటారు. చేపలవల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. చేపలు తినడం వల్ల ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ వంటి పోషకాలు అన్నీ పొందవచ్చని నిపుణులు అంటున్నారు. అదే విధంగా అమైనో యాసిడ్స్, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ వంటివి చేపలలో ఉంటాయంటున్నారు నిపుణులు. చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరులో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. చాలా రకాల చేపలలో విటమిన్ 'ఎ' పుష్కలంగా ఉంటుందని, దీని వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. చేపలలో లీన్ ప్రొటీన్‌ పుష్కలంగా ఉండటం వలన ఇది కణజాలాలను నిర్మించడానికి సహాయపడుతుందంటున్నారు. చేపలు తినడం వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

"ఫిష్​ ఫ్రై బిర్యానీ" ఎప్పుడైనా ట్రై చేశారా? - ఈ టేస్ట్​ అస్సలు మర్చిపోలేరు!

Last Updated : Dec 26, 2024, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.