ఏం అభిమానం భయ్యా నీది!! - రక్తంతో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చిత్రపటం - Ex MLA Gummadi Narsaiah Painting - EX MLA GUMMADI NARSAIAH PAINTING
🎬 Watch Now: Feature Video
Published : Apr 10, 2024, 3:58 PM IST
Ex MLA Gummadi Narsaiah Painting With Blood : సినీ హీరోలకు, క్రికెట్ స్టార్లను యువత ఎక్కువగా అభిమానిస్తుంటారు. వారి చిత్రాలను టాటూలుగా తమ శరీరంపై వేసుకుంటారు. ఇలా తమ అభిమానాన్ని ప్రకటించేందుకు పలు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. పెట్టుబడిదారులే రాజకీయాలు చేస్తున్న ఈ రోజుల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా అతి సాధారణ జీవితం గడుపుతున్న గుమ్మడి నర్సయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాన్ని సాగిస్తూ, ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు ఆత్మీయులను పంచన చేర్చుకున్న ఆయనపై ప్రేమను తన రక్తంతో చూపించారు. గుమ్మడి నర్సయ్య చిత్రాన్ని తన రక్తంతో గీయించాడు. ఖమ్మం జిల్లాకు చెందిన పీడీఎస్యూ కార్యదర్శిగా పని చేస్తున్న ఓంగూరు వెంకటేశ్ స్వచ్ఛమైన రాజకీయాలు రావాలని డబ్బు ప్రభావం లేని రాజకీయ నేతలు రావాలంటూ కోరుకుంటున్నాడు. ఖమ్మంలోని కాకతీయ పీజీ కళాశాలలో ఎంస్సీ సైకాలజీ చదువుతున్న ఆయన నిజాయతీపరులు రాజకీయాల్లో ఉండాలని ఆశించాడు. అలాంటి వారికి ప్రజల్లో ఆదరణ ఎప్పటికీ తరగదని నిరూపించేందుకు ఇలా ప్రయత్నం చేశానని చెప్పాడు.