అనుమతి లేకుండా హైవేపై నిర్మాణాలు - మల్లారెడ్డి కుమారుడికి చెందిన షెడ్డు కూల్చివేత - Medchal Sheds Demolition - MEDCHAL SHEDS DEMOLITION
🎬 Watch Now: Feature Video
Published : Apr 6, 2024, 2:17 PM IST
Ex Minister Malla Reddy Son Shed Demolished in Medchal : ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను మేడ్చల్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న రేకుల షెడ్లకు అనుమతులు తీసుకోకుండా నిర్మించారని కాంగ్రెస్ నాయకుడి ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగారు. టీపీవో రాధాకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతలు జరిపారు. మేడ్చల్ డిపోకు ఎదురుగా ఉన్న రేకుల షెడ్లను నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అధికారులు కూల్చివేశారు.
ఈ నిర్మాణాలు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి చెందినవిగా ఫిర్యాదులో పేర్కొన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. కాగా మల్లారెడ్డి అక్రమంగా నిర్మించిన వాటిని ప్రభుత్వం కూల్చి వేస్తోంది. తాజాగా ఆయన కుమారుడికి సంబంధించినది కూల్చడంతో రాజకీయంగా చర్చనీయంశంగా మారింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు పంజా విసురుతున్నారు. అనుమతులు తీసుకుని ట్రాఫిక్ సమస్యకు తలెత్తకుండా వ్యాపారాలు సాగించాలని సూచిస్తున్నారు. మున్సిపల్ అనుమతులపై అవగాహన కల్పిస్తున్నారు.