మోదీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన బాధ్యత అందరిదీ : ఈటల రాజేందర్ - Etela Rajender On Modi Government
🎬 Watch Now: Feature Video
Published : Mar 13, 2024, 5:47 PM IST
Etela Rajender On Modi Government : మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఎల్బీనగర్లోని మన్సూరాబాద్ వాకర్స్ అసోసియేషన్, హరిణ వనస్థలి పార్క్‌లో వాకర్స్‌తో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. భారత ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ప్రధాని మోదీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన బాధ్యత అందరిదీ అని ఈటల అన్నారు. భారత జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని ఆయన కొనియాడారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకొంటున్నామంటే దానికి కారణం ఎవరో అందరికీ తెలుసని ఈటల పేర్కొన్నారు. తనకు రైటిస్ట్, లెప్టిస్ట్ అంటే ఏంటో తనకు తెలియదన్నారు. రాజకీయపార్టీల ప్రథమ కర్తవ్యం ప్రజలకు సేవ చేయడం మాత్రమేనని ఈటల రాజేందర్ తెలిపారు. ఆ సిద్ధాంతాన్ని నమ్మే తాను రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. 2008లో తెలంగాణ కోసం తాను రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఈటల గుర్తు చేశారు.