రష్యన్ మహిళను తొండంతో పైకెత్తి పడేసిన ఏనుగు- కాలు ఫ్రాక్చర్- గౌరీపై ప్యాలెస్ బ్యాన్! - Elephant Attack woman viral video
🎬 Watch Now: Feature Video


Published : Feb 29, 2024, 12:24 PM IST
Elephant Attack On Russian Woman Viral Video : రాజస్థాన్ జయపురలోని ఆమెర్ ప్యాలెస్‌కు వచ్చిన ఓ రష్యన్ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆ మహిళను ఓ ఏనుగు ఒక్కసారిగా తన తొండంతో పైకెత్తి పడేదిసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏనుగు దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగందంటే?
ఫిబ్రవరి 13వ తేదీన ఆమెర్ ప్యాలెస్‌లో సవారీ అనంతరం ఏనుగులంతా జలేబ్ చౌక్‌కు చేరుకున్నాయి. వాటిలో ఒకటైన గౌరీ అనే ఏనుగు వద్దకు రష్యన్ మహిళ వెళ్లింది. ఏనుగు నోరు, కళ్లను తాకింది. దీంతో ఒక్కసారిగా మహిళను పైకెత్తి పడేసింది ఏనుగు. మావటి కూడా కిందపడిపోయాడు. గమనించిన మిగతా పర్యటకులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే మహిళను ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు- కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మహిళ చికిత్స పొందుతోంది. ఈ ఘటన తర్వాత ఆ ఏనుగుపై సవారీ చేయడంపై ప్యాలెస్ అధికారులు నిషేధం విధించారు. ఇక పెటా సంస్థ ఆమెర్ ప్యాలెస్‌లో ఏనుగుల స్వారీని నిషేధించాలని కోరుతూ రాజస్థాన్ ఉపముఖ్యమంత్రికి లేఖ రాసింది.