రైతు కూలీలపై ఏనుగు దాడి- త్రుటిలో తప్పించుకొన్న వ్యక్తి- లైవ్ వీడియో - Elephant Attack On Farmers
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/640-480-20902814-thumbnail-16x9-elephant-attacked-labour-in-karnataka.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Mar 4, 2024, 5:57 PM IST
Elephant Attack On Labours In Karnataka : కర్ణాటక హసన్ జిల్లాలోని కేసగులి గ్రామంలో ఓ అడవి ఏనుగు ఆదివారం బీభత్సం సృష్టించింది. సకలేష్‌పుర్ తాలూకాలోని ఓ వక్క గింజల తోటలోకి చొరబడిన గజరాజు, అక్కడే పనిచేస్తున్న ఇద్దరు వ్యవసాయ కూలీలపై దాడికి యత్నించింది. ఏనుగు రాకను గమనించిన కూలీలు వెంటనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏనుగు దాడి నుంచి ఒకరు త్రుటిలో తప్పించుకోగా, మరో కూలీని వెంబడించింది గజరాజు. దీంతో తోటలోని ఓ గదిలోకి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ గదికి తాళం ఉండడం వల్ల అక్కడే పార్క్ చేసి ఉన్న ఓ కారు కిందకు వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు తోటలో ఏర్పాటు చేసిన ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఏడాది జనవరిలో కూడా ఇదే హసన్ జిల్లాలోని మట్టవర్ ప్రాంతంలో ఓ అడవి ఏనుగు దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు.