పొగలు వస్తున్నాయని పక్కకు నిలిపాడు - చూస్తుండగానే మంటలు చెలరేగి దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటీ - Electric Scooty Caught fire - ELECTRIC SCOOTY CAUGHT FIRE
🎬 Watch Now: Feature Video
Published : Apr 11, 2024, 7:33 PM IST
Electric Scooty Caught fire in Kamareddy : కామారెడ్డి జిల్లా కేంద్రంలో హఠాత్తుగా ఓ ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైంది. మాయాబజార్ ప్రాంతానికి వంటల శివ కృష్ణమూర్తి అనే వ్యక్తి తన స్కూటీపై పని నిమిత్తం బయటకు వచ్చాడు. తాను నడుపుతున్న స్కూటీ నుంచి పొగలు వచ్చాయి. ఇది గమనించిన ఆయన, తన ద్విచక్ర వాహనాన్ని పక్కనే పార్కింగ్ చేశాడు. అనంతరం స్కూటీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.
Electric Scooty Burnt in Kamareddy District : మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బ్యాటరీ సమస్యతో స్కూటీ కాలిపోయిందా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అక్కడున్న స్థానికులు విచారించగా తనకు తెలియదని వాహనదారుడు వాపోయాడు. స్కూటీ కాలిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరుచుగా జరుగుతున్నాయని, వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేయించాలని, చిన్న సమస్య అయినా త్వరగా రీపేర్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.