రామోజీకి ఎస్‌పీ బాలు పాదాభివందనం - దివికేగిన ఈ ఇద్దరు మిత్రుల స్నేహం గురించి తెలుసా? - RAMOJI BALASUBRAMANYAM FRIENDSHIP VIDEO - RAMOJI BALASUBRAMANYAM FRIENDSHIP VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 2:16 PM IST
Ramoji SP Balu Friendship Video : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యావత్ సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. రామోజీరావు, బాలసుబ్రహ్మణ్యం ఇద్దరూ ఇద్దరే. ఒకరు పాత్రికేయ రంగంలో, వ్యాపారంలో అసమాన యోధుడైతే మరొకరు సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి. వీరిద్దరి స్నేహం ఎంతో ప్రత్యేకం. ఈటీవీ ఆధ్వర్యంలో పాడుతాతీయగా, స్వరాభిషేకం కార్యక్రమాల గురించి తెలియని వారుండరు. ఈ కార్యక్రమాల్లో బాలు రామోజీతో తన స్నేహం గురించి ఎన్నోసార్లు మనతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో రామోజీతో తన స్నేహాన్ని గుర్తుచేసుకుని బాలు భావోద్వేగానికి లోనయ్యారు. ఈటీవీ మొదలుపెట్టినప్పటి నుంచి లోగోకు పాట పాడినప్పటి నుంచి ఈటీవీ సంస్థ చేపట్టిన ప్రతి ప్రత్యేక కార్యక్రమానికి తనచేతే పాడించడంపై బాలు మాట్లాడారు. అలాగే పాడుతాతీయగా కార్యక్రమాన్ని తనచేత చేయించడానికి ఎలా ఒప్పించారో కూడా చెప్పారు. అంతే కాకుండా దివికేగిన ఈ ఇద్దరు మిత్రుల స్నేహం గురించి బాలు షేర్ చేసుకున్న విషయాలు, ఈ ఇద్దరూ ఒకే వేదికపైన కలిసి ఉన్న ఆ అపురూప దృశ్యం మీకోసం.
TAGGED:
RAMOJI SPB FRIENDSHIP VIDEO