ఇంకా తగ్గని వరద ఉద్ధృతి - 9 రోజులుగా జల దిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం - EDUPAYALA TEMPLE 9 DAYS OF FLOOD
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2024, 2:01 PM IST
Edupayala Temple News Today : మెదక్ జిల్లాలోని ఏడుపాయల పుణ్యక్షేత్రం 9 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. ఈ ఆలయం ముందున్న ఆనకట్ట పొంగిపొర్లడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ఆలయాన్ని అర్చకులు తాత్కాలికంగా మూసివేసి రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠంచి ప్రత్యేక పూజలు, అభిషేకం, సహస్ర నామార్చన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. వరద ఉద్ధృతి తగ్గగానే యథావిధిగా గర్భగుడి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
మంజీర నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండండి : సింగూర్ నుంచి నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట నుంచి 34 వేల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోందని, మంజీరా నదీ పరీవాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గర్భగుడి వైపు, ప్రాజెక్టు వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి పటిష్ఠ భద్రతను కల్పిస్తున్నారు.